![]() |
![]() |

సౌమ్యరావు జబర్దస్త్ యాంకర్ గా ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుని ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ప్రేక్షకులు కూడా ఆమెకు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు సౌమ్య తనకు ఈ జబర్దస్త్ ఛాన్స్ ఎలా వచ్చింది అనే విషయాన్ని ఒక వీడియోగా చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ డేట్ చేసింది. " ఈటీవీలో నేను చేసిన "భలే మంచి రోజు" అనేది నా ఫస్ట్ స్టేజి షో. అదే టైంలో నేను ఒక జబర్దస్త్ టీమ్ తో ఫన్నీగా మాట్లాడానట. అది చూసిన జబర్దస్త్ మేకర్స్ నా గురించి కనుక్కోమని చెప్పారట.
ఐతే అప్పటికి నాకు సీరియల్స్ తప్ప జబర్దస్త్ అనే ఇంత పెద్ద షో ఉందన్న విషయం కూడా తెలీదు. అలాగే సెప్టెంబర్ లో నాకు ఒక కాల్ వచ్చింది. తీరా చూస్తే యాంకరింగ్ లో ఇంటరెస్ట్ ఉంది..వస్తారా అని అడిగారు. నేను ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారని అనుకుని నేను సీరియస్ గా మాట్లాడాను. ఇక చివరికి ఆ కాల్ నిజమని అది మల్లెమాల వాళ్ళ నుంచి వచ్చింది అని తెలిసింది. అప్పుడు నేను వాళ్లకు ముందుగా చెప్పిన విషయం నాకు తెలుగు రాదు మీరు ఓకే అంటే ఆడిషన్ కి వస్తాను అని నేను చెప్పేసరికి పర్వాలేదు తర్వాత తెలుగు వచ్చేస్తుంది మీ తెలుగు ప్రెటీగా ఉంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు రండి అని చెప్పారు. అలా ఆడిషన్ కి వెళ్ళాను.
తర్వాత ఫోర్ కాస్ట్యూమ్స్ లో నన్ను టెస్ట్ చేశారు. మోడరన్, ఇండో వెస్ట్రన్, టిపికల్, ట్రెడిషనల్ అన్నిట్లో చూసారు. నాతో డైలాగ్స్, స్పాన్సర్స్ నేమ్స్ చెప్పించారు. ఇంకో ఫన్నీ థింగ్ ఏమిటి అంటే అన్ని కాస్ట్యూమ్స్ వేయించి మూడు కెమెరాలు పెట్టి నవ్వమని చెప్పారు. అలా నేను కూడా నవ్వాను. అలా వారం తర్వాత ఫోన్ చేసి రెండు రోజుల్లో షూట్ ఉంది వచ్చేయండి అన్నారు. నాకు డాన్స్ అంత బాగా రాదు. నాది కొంచెం షై క్యారక్టర్...అనసూయ, రష్మీ గారు సూపర్ గా డాన్స్ చేస్తారు. నాకు సీరియల్స్ లో నటించడం తెలుసు కానీ ఇలా డాన్స్ చేయడం అనేది నాకు చాలా భయం. డాన్స్ క్లాసెస్ కి వెళ్తున్నా..త్వరలోనే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాను. ఇంకా చెప్పాలి అంటే మల్లెమాల వాళ్ళు నాకు కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు. కానీ నేను అంత మోడరన్ కాదు. మోడరన్ డ్రెస్సెస్ వేసుకోవడం కూడా త్వరలో అలవాటు చేసుకోవాలి. ఏది నేర్చుకోవాలి అన్నా కొంచెం టైం పడుతుంది కదా..టైం ఇస్తే పర్ఫెక్ట్ గా చేస్తాను" అని చెప్పింది సౌమ్యరావు.
![]() |
![]() |